దుబాయ్: ఉత్కంఠ భరితంగా సాగుతున్న భారత్, పాకిస్థాన్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన భారత్ 151 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ (57), రిషభ్ పంత్ (39) రాణించగా మిగతా ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేదు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లో రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా, మూడో ఓవర్లో రాహుల్ (3) పెవిలియన్ చేరాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (11) కూడా అవుటయ్యాడు. ఇలా భారత బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు.
పంత్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో కోహ్లీ, హార్దిక్ పాండ్యా కూడా వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ 3, హసన్ అలీ 2 వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 152 పరుగుల లక్ష్యంతో పాక్ జట్టు బరిలో దిగనుంది.
Target set 🎯
— T20 World Cup (@T20WorldCup) October 24, 2021
Pakistan will chase 152 for a victory.
Will they get over the line?#T20WorldCup | #INDvPAK | https://t.co/UqPKN2ouME pic.twitter.com/N4gqUjJLLk
INNINGS BREAK!
— BCCI (@BCCI) October 24, 2021
Captain @imVkohli's fine 5⃣7⃣ & @RishabhPant17's 3⃣9⃣ guide #TeamIndia to 1⃣5⃣1⃣/7⃣. 👍 👍#T20WorldCup #INDvPAK
Scorecard ▶️ https://t.co/eNq46RHDCQ pic.twitter.com/in0w8qSrir