IND Vs PAK | ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్‌పై తమకు ఎదురే లేదని టీమిండియా మరోసారి నిరూపించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయిలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో టీమిండియా సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పరాజయం పాలవడంతో అటు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం సొంత జట్టుపై తీవ్ర విమర్శలకు దిగారు. ఇటీవల కొంతకాలంగా తమ జట్టు భారత్‌పై విజయం సాధించాలని.. చాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. అయితే, ఈ చాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు భారత్‌పై ఓడిపోవడంతో పాటు చాంపియన్స్ ట్రోఫీలో ఆశలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు వసీం అక్రమం, షోయబ్ అక్తర్, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మహ్మద్ అమీర్, అహ్మద్ షాజాద్ పలువురు మాజీలు పాకిస్తాన్ జట్టు ఆటతీరుపై విమర్శలు గుప్పించారు. అలాగే, పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. పాక్ బోర్డు చెత్త జట్టును ఎంపిక చేసిందని.. దానికి పరిణామాలను అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
భారత్‌పై పాక్ ఓటమి తర్వాత ఇన్‌స్టా వేదికగా అక్తర్ ఓ వీడియోను షేర్ చేశాడు. పాక్ ఓటమిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తాను ఓటమిపై విచారం, నిరాశ చెందడం లేదన్నాడు. జట్టులో కనీసం ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు లేరని.. అదే తనకు బాధగా ఉందని తెలిపాడు. ఆటగాళ్లకు ఏం చేయాలో తెలియదని.. వారికి ఎలాంటి నైపుణ్యం లేదంటూ విమర్శించారు. వారంతా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవాలని.. ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో తనకు ముందే తెలుసునని పేర్కొన్నాడు. ప్రస్తుత పాక్‌లోని ఆటగాళ్లకు ఏం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని అక్తర్ ప్రశంసించాడు. తాను కోహ్లీ ఫామ్‌లో లేకపోతే పాక్‌తో మ్యాచ్ అని చెబితే పూర్తిగా సన్నద్ధమవుతాడని చెప్పానని.. ఈ మ్యాచ్‌లో తాను చెప్పినట్లే చేశాడన్నాడు. వన్డేల్లో విరాట్ రన్ చేజ్ మాస్టర్ అని.. అద్భుతమైన క్రికెటర్ అంటూ ప్రశంసించాడు. శత శతకాలను సాధిస్తాడో లేదో తెలియదని.. అతనో గొప్ప బ్యాట్స్‌మెన్ అని.. విరాట్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేశాడని.. శత శతకాలు చేయాలని కోరుకుంటున్నానన్నాడు. ఆధునిక క్రికెటర్ రారాజు అని.. అతని ఆటను ఆడనివ్వాలని విజ్ప్తి చేశాడు.
భారత్‌పై ఓటమి తర్వాత పాక్ మాజీ కెప్టెన్, లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ నిరాశను వ్యక్తం చేశారు. అభిమానులు జట్టు ఆటను చూసి సహించేందుకు సిద్ధంగా లేరన్నారు. మనం కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇప్పటి వరకు చేసింది చాలు అని పేర్కొన్నారు. వైట్‌బాల్ క్రికెట్లో సంవత్సరాలుగా ఒకే ఆటగాళ్లతో మనం ఓడిపోతున్నామని.. ఇప్పుడు ధైర్యంగా అడుగులు వేస్తూ.. నిర్భయంగా క్రికెట్ ఆడే యువకులను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భారీ మార్పులు చేయాలనుకుంటే.. కొత్త ఆటగాళ్లకు కొంత సమయం, మద్దతు ఇవ్వాలని.. 2026 టీ20 వరల్డ్ కప్‌కి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని సూచించారు. ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి వారిని స్టార్లుగా మార్చారని.. తాము జట్టుగా సరిగా లేదని చెబుతున్నామన్నారు. పాకిస్తాన్ బౌలర్లు గత ఐదు మ్యాచుల్లో 60 సగటుతో 24 వికెట్లు తీశారన్నారు. ఈ సంవత్సరం వన్డే క్రికెట్లో ఓడిపోయిన ఒమన్, యూఎస్ఏతో సహా 14 జట్లలో పాకిస్తాన్ బౌలింగ్ గణాంకాలు చెత్తగా ఉన్నాయన్నారు. పీసీబీ చైర్మన్ స్వదేశానికి వెళ్లి కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీని ఎలాంటి జట్టును ఎంపిక చేశారో అడగాలని సూచించారు.
వసీం అక్రమ్ పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్‌పై మండిపడ్డాడు. కెప్టెన్ ఓడకు నాయకుడని.. రిజ్వాన్‌కు ఏ మ్యాచ్ విన్నింగ్ ఆటగాడు అవసరమో తెలియకపోతే జట్టు ఎలా విజయం సాధిస్తుంది? అంటూ ప్రశ్నించారు. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అభిమానులు ముందుగానే స్టేడియం నుంచి వెళ్లిపోవడం తాను ఎప్పుడూ చూడని విషయమని.. ఇది దురదృష్టకరమన్నారు. అలాగే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆమిర్, షాజాద్, రషీద్ లతీఫ్ సైతం రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. జట్టులో వర్గ విభేదాలు ఉన్నాయని పలువురు ఆరోపించారు. జట్టులో గ్రూప్స్ ఉన్నాయని.. ఎవరు కెప్టెన్ అవుతారో వారు తమలో తాము నిర్ణయించుకుంటారని.. ప్రతిభావంతులైన ఆటగాడు కనిపిస్తే.. వారిని వెంటనే తొలగించే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో ప్రతిభకు లోటు లేదని.. కానీ, వారికి సరైన మార్గం చూపేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. పాకిస్తాన్ జట్టులో ప్రణాళిక లేదన్నారు.
భారత్ జట్టు లక్ష్యాన్ని ఛేదించే సమయంలో రెండు వికెట్ల నష్టానికి వంద పరుగులు పూర్తి చేసినప్పుడు.. పాకిస్తాన్ ఓడిపోతుందని తనకు ఓ స్నేహితుడి నుంచి మెస్సేజ్ వచ్చిందని సనా మీర్ పేర్కొన్నారు. అయితే, జట్టును ఎంపిక చేసే సమయానికే మనం ఇప్పటికే ఓడిపోయామని తానను జవాబు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలోనే మనం టోర్నీని సగం కోల్పోయమని.. ఈ 15 మంది ఆటగాళ్లకు ఎంఎస్ ధోనీ, యూనిస్ ఖాన్‌ను కెప్టెన్‌గా చేసినా వారు కూడా ఏం చేయలేరన్నారు. మాజీ కెప్టెన్ ఇంజమామ్ సైతం స్పందించారు. పాక్ జట్టు ప్రదర్శనపై తాను బోర్డుతో మాట్లాడుతానని చెప్పారు. సెలెక్టర్లను ప్రశ్నించాలని.. కానీ, వారు బోర్డుతో మాట్లాడాల్సిన జట్టును ఎంచుకున్నారన్నారు.
Even Wasim Akram agreed we have Worst bowling unit in the Worldpic.twitter.com/f3EibGmw2p
— Babar Khan (@Babaristic) February 23, 2025
Today’s state of affairs explained by @realshoaibmalik pic.twitter.com/AcyLlTQIDE
— Shoaib Akhtar (@shoaib100mph) February 23, 2025