టీ20 ప్రపంచకప్లో భాగంగా జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్కు బౌలర్లు శుభారంభం అందించారు. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (0), మహమ్మద్ రిజ్వాన్ (4) ఇద్దరినీ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేర్చారు.
అనంతరం వచ్చిన షాన్ మసూద్ (52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (51) రాణించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు షాదాబ్ ఖాన్ (5), హైదర్ అలీ (2), మహమ్మద్ నవాజ్ (9), ఆసిఫ్ అలీ (2) ఎవరూ రాణించలేదు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ (8 బంతుల్లో 16), హారిస్ రవూఫ్ (4 బంతుల్లో 6 నాటౌట్) బౌండరీలు బాదారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ చెరో వికెట్ తీసుకున్నారు.
India restricts Pakistan to a total of 159 in 20 overs.
– Can #Pakistan ’ Bowlers defend this total❔
🔴 Live: https://t.co/ml2IQe3DNV#CricksLab #T20WorldCup #INDvPAK #Cricket pic.twitter.com/EuRrxQXfLL
— CricksLab (@CricksLab) October 23, 2022