సూపర్-4లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన 9వ ఓవర్లో ఫఖర్ జమాన్ (15) అవుటయ్యాడు. అంతకుముందు బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీకి తరలించిన ఫఖర్.. తర్వాతి బంతికి లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ కొట్టేందు ప్రయత్నించాడు. అయితే బంతి స్లోగా రావడంతో అతను ఆశించినంత స్థాయిలో బలంగా బాదలేకపోయాడు. దాంతో లాంగాన్‌లో కోహ్లీకి సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ జట్టు 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.