IND vs PAK : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జవేరియా ఖాన్ 8 పరుగులు చేసి ఔట్ అయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో ఆమె షాట్‌కు ప్రయత్నించింది. హర్మన్‌ప్రీత్ క్యాచ్ అందుకోవడంతో జేవేరియా పెవిలియన్ బాట పట్టింది. దాంతో, పాకిస్థాన్ 10 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 31 రన్స్ చేసింది. మునీబ ఆలీ (5), బిస్మాహ్ మరూఫ్ (18) క్రీజులో ఉన్నారు. మహిళల టీ20లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.