ధాటిగా ఆడుతూ భారత్ నిర్దేశించిన లక్ష్యానికి చేరువగా పాకిస్తాన్ను తీసుకెళ్లిన మహమ్మద్ నవాజ్ (42) అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నవాజ్.. బంతిని మిస్ టైం చేశాడు. దీంతో లాంగాఫ్లో ఉన్న దీపక్ హుడాకు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు. మరో బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (63 నాటౌట్) క్రీజులోనే ఉన్నాడు. పాకిస్తాన్ జట్టు 136 పరుగల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.