భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్లో ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆసిఫ్ అలీ (9) కూడా అవుటయ్యాడు. భువీ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అలీ.. బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్కు చిక్కాడు. అంతకుముందు పాండ్యా బౌలింగ్లో ఒకే ఓవర్లో రిజ్వాన్ (43), ఖుష్దిల్ (2) అవుటవడంతో అలీపైనే పాక్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
ఆ తర్వాత కాసేపటికే అర్షదీప్ బౌలింగ్లో మహమ్మద్ నవాజ్ (1) కూడా అవుటయ్యాడు. అర్షదీప్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. కీపర్ దినేష్ కార్తీక్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ జట్టు 114 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.