IND Vs NZ Match Weather | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. 2000 సంవత్సరంలో ఫైనల్లో ఇరు జట్లు ఫైనల్లో తలపడగా.. మళ్లీ 25 సంవత్సరాల తర్వాత రెండు జట్లు ఫైనల్లో ఆడబోతున్నాయి. న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉన్నది. ఇక కివీస్ జట్టు సైతం గతంలో తరహాలోనే మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే కృతనిశ్చయంతో ఉన్నది. ప్రస్తుత జట్లలో చాలామంది సూపర్ స్టార్ ఆటగాల్లు ఉన్నారు. రెండు జట్లు సముజ్జీవులుగా కనిపిస్తున్నాయి.
భారత్ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయాలను సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. దుబాయిలో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించింది. టీమిండియా ప్లేయర్లలో విరాట్ కోహ్లీ, అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ సైతం పర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ సైతం టోర్నీలో భారత్‌కు శుభారంభాన్ని అందించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మరో వైపు బౌలర్లలో మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో కివీస్ జట్టు సైతం తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టు సైతం గ్రూప్దశ మ్యాచ్‌లో కేవలం భారత్ జట్టుపైనే ఓడిపోయింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై భారీ స్కోర్ చేయడం విశేషం. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారీ స్కోర్ చేయగలిగింది.
ఐసీసీ టైటిల్ మ్యాచ్‌కు రెండు జట్లతో పాటు అభిమానులు సైతం సిద్ధమయ్యారు. మ్యాచ్ సమయంలో దుబాయిలో వర్షం పడుతుందా? వాతావరణం ఎలా ఉందోనని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్ సమయంలో వర్షం పడేందుకు అవకాశం లేదని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. దుబాయిలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగా ఉండొచ్చని అంచనా. సమయం గడిచే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. వరుణుడు ఆటంకం కలిగించినా.. చాంపియన్స్ ట్రోఫీకి రిజర్వ్‌డే ఉంటుంది.
IND vs NZ | చాంపియన్స్ ఫైట్.. నేడు భారత్, న్యూజిలాండ్ ఫైనల్ పోరు