జైపూర్: హాఫ్ సెంచరీకి రెండు పరగుల దూరంలో రోహిత్ శర్మ (48) అవుటయ్యాడు. కివీస్‌తో జైపూర్ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన భారత కెప్టెన్.. ట్రెంట్ వేసిన స్లో బౌన్సర్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్‌గా వెనుతిరిగాడు.
165 పరుగుల ఛేజింగ్‌లో రాహుల్ (15)తో కలిసి రోహిత్ జట్టుకు శుభారంభం అందించాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే భారత జట్టు 50 పరుగులు చేసింది. ఆ తర్వాత రాహుల్ అవటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (40 నాటౌట్)తో కలిసి ఛేజింగ్‌ను రోహిత్ ముందుండి నడిపించాడు. త్రుటిలో అర్ధశతకం చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.