Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ క్రమంలోనే 57 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 23 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 15 పరుగులు చేసిన విల్ యంగ్‌ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కివీస్ మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయపడ్డాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో.. అతనికే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. అందుకోలేకపోయాడు. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద శ్రేయాస్ అయ్యర్ సైతం క్యాచ్‌ను వదిలేశాడు. అయితే, రెండు క్యాచ్‌లు పట్టడం కాస్త కష్టమే అయినా.. అందుకుంటే మాత్రం జోరుమీదున్న రచిన్ రవీంద్రను కట్టడి చేసే అవకాశం దక్కేది.