IND vs NZ | తొలి టీ20లో న్యూజిలాండ్ విజయం
తొలి టీ20లో భారత్‌పై న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో గెలిచింది. చివర్లో ఆల్‌రౌండర్ సుందర్ ధాటిగా ఆడినా అతనికి సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. మూడు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
IND vs NZ : తొలి టీ20లో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. 21 పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్లో 33 రన్స్ అవసరమయ్యాయి. అయితే.. ఫెర్గూసన్, పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా, సుందర్(50)ను ఔట్ చేశాడు. 177 టార్గెట్ ఛేదనలో కివీస్ స్పిన్నర్లు వెంట వెంటనే వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. సూర్యకుమార్ (47), పాండ్యా(21) కాసేపు ప్రతిఘటించారు. సూర్యకుమార్, హార్దిక్ వెంట వెంటనే ఔట్ చేసి కివీస్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. చివర్లో ఆల్‌రౌండర్ సుందర్ ధాటిగా ఆడినా అతనికి సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. అతను దీపక్ హుడా(10)తో కలిసి స్కోర్ వంద దాటించాడు. 19 ఓవర్ నాలుగో బంతికి ఔట్ అయ్యాడు. దాంతో, కివీస్ 21 రన్స్‌తో గెలిచి మూడు టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
15 పరుగులకే 3 వికెట్లు
177.. టార్గెట్ చిన్నదే. కానీ, లక్ష్య ఛేదనలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 15 పరుగులకే శుభ్‌మన్ గిల్ (7) రాహుల్ త్రిపాఠి (0), ఇషాన్ కిషన్ (4) పెవిలియన్ చేరారు. దాంతో, సూర్యకుమార్ (47), పాండ్యా(21) ఇన్నింగ్స్ నిర్మించే భాద్యత తీసుకున్నారు. వీళ్లు నాలుగో వికెట్‌కు 68 రన్స్ చేశారు. అయితే.. ఈ జోడీని సోధి విడదీశాడు. ఆ తర్వాత దీపక్ హుడా(10) నిరాశపరిచాడు. కివీస్ బౌలర్లలో శాంటర్న్, బ్రాస్‌వెల్ తలా రెండు వికెట్లు తీశారు. జాకబ్ డఫీ, సోధీ, ఫెర్గూసన్‌కు ఒక వికెట్ దక్కింది.
కాన్వే, మిచెల్ హాఫ్ సెంచరీ
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. ఓపెనర్ కాన్వే(52), మిచెల్ (59) అర్థశతకాలతో జట్టును అదుకున్నారు. అలెన్ (35), ఫిలిప్స్(17), మైఖేల్ బ్రేస్‌వెల్ (1) తక్కువ స్కోర్‌కే పరిమితం అయ్యారు.స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో ఓపెనర్ ఫిన్ అలెన్ (35) చాప్మన్ (0) ఔట్ చేశాడు. దాంతో, 43 పరుగలు వద్ద కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడ్డ కివీస్‌ను కాన్వే అదుకున్నాడు. ఫిలిప్స్(17)తో కలిసి జట్టు స్కోర్ వంద దాటించాడు. ఆ తర్వాత డారెల్ మిచెల్ రెచ్చిపోయి ఆడాడు. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు, ఫోర్ బాదాడు. దాంతో ఆ ఓవర్లో 26 రన్స్ వచ్చాయి. మిచెల్ 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

