IND vs NZ : పవర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. ఓపెనర్ కాన్వే (36), నికోలస్ (32) ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు. రెండో వికెట్‌కు 73 రన్స్ చేశారు. దాంతో, వీళ్లద్దరూ నిలకడగా ఆడుతుండడంతో రన్స్ వేగంగా వస్తున్నాయి. భారీ టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ బౌల్డ్ అయ్యాడు.