జైపూర్: టీమిండియా ఓపెనర్ల జోరుకు మిచెల్ శాంట్నర్ కళ్లెం వేశాడు. కివీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ తొలి మ్యాచ్ జైపూర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కేఎల్ రాహుల్ (15), రోహిత్ శర్మ (31 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు.
ముఖ్యంగా రోహిత్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ కేవలం ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. కానీ ఆరో ఓవర్లో బంతి అందుకున్న మిచెల్ శాంట్నర్ తొలి బంతికే రాహుల్‌ను పెవిలియన్ చేర్చాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన రాహుల్.. డీప్ స్క్వేర్ లెగ్‌లో చాప్మ్యాన్కు చిక్కాడు.
దీంతో 50 పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5 నాటౌట్) బౌండరీతో పవర్‌ప్లే ముగించాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 56/1 స్కోరుతో నిలిచింది.