IND Vs NZ Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్.. భారత్ జట్టు బలమైన పోటీదారని మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. కానీ, న్యూజిలాండ్ సైతం చాలా బలమైన జట్టని చెప్పారు. భారత జట్టు మ్యాచులన్నీ దుబయిలోనే ఆడి గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్స్‌లోనూ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.
భారత్ తర్వాత గ్రూప్-ఏలో న్యూజిలాండ్ రెండవ స్థానంలో నిలిచింది. లాహోర్‌లో జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడారు. భారత్‌ను ఓడిగించగలిగే జట్టు ఉందంటే అది న్యూజిలాండ్ అన్నారు. భారత్ బలమైన పోటీదారు కానీ.. దానికి పెద్దగా ప్రయోజనం లేదన్నారు.
2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ పోటీపడ్డాయి. న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సారి ఫైనల్ గమనాన్ని మార్చగలిగే నలుగురు న్యూజిలాండ్ ప్లేయర్ల గురించి రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేన్ విలియమ్సన్ స్థిరత్వం, ప్రశాంతతను ప్రశంసించారు. రచిన్ రవీంద్రను ప్రతిభావంతుడిగా అభివర్ణించారు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను తెలివైన కెప్టెన్ అని, గ్లెన్ ఫిలిప్‌ను జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా పేర్కొన్నారు.
చాంపియన్స్ ట్రోఫీలో రాణిస్తున్న సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని మాజీ హెడ్‌కోచ్ ప్రశంసించారు. విరాట్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు. కీలక సమయంలో మంచి ప్రదర్శన చేసిన విలియమ్సన్ కూడా ఆయన ప్రశంసించారు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ గురించి మాట్లాడుతూ.. అలాంటి ఆటగాళ్లను మొదటి పది పరుగులు చేయడానికి అవకాశం ఇస్తే.. వారు చాలా సమయం తర్వాత ఆడతారని.. విలియమ్సన్, కోహ్లీ అయినా అంతేనన్నారు. విలియమ్సన్, రచిన్ ఇద్దరూ తెలివైన ప్లేయర్స్‌గా పేర్కొన్నారు.
రచిన్ రవీంద్రపై శాస్త్రి ప్రశంసలు కురిఇంచారు. అతను క్రీజులో కదిలే విధానం తనకు నచ్చిందని తెలిపారు. సరళంగా బ్యాటింగ్ చేస్తాడని.. స్ట్రోక్ అద్భుతంగా ఉంటుందన్నారు. అతను చాలా ప్రతిభావంతుడని చెప్పారు. విలియమ్సన్ గురించి ఆయన మాట్లాడుతూ.. అతను చాలా స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాడని.. తన పని విషయంలో చాలా సీరియస్‌గా ఉంటాడని పేర్కొన్నారు. అతనో సాధువులాంటివాడని.. ధ్యానం చేస్తున్నట్లుగా ఉంటాడని పేర్కొన్నారు. జో రూట్, విలియమ్సన్, కోహ్లీ, వారందరికీ అద్భుతమైన ఫుట్‌వర్క్ ఉందని తెలిపారు.
శాంట్నర్‌ను శాస్త్రి ప్రశంసించారు. అతను చాలా తెలివైనవాడని.. అతను కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నాడన్నారు. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా, క్రికెటర్‌గా రాణిస్తున్నాడని.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆల్ రౌండర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. భారత్ నుంచి అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆల్ రౌండర్ కావొచ్చునన్నారు.