BCCI | స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 0-3 తేడాతో కివీస్ టీమ్ వైట్‌వాష్ ఏసింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశంలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత పలువురు వెటరన్ ఆటగాళ్ల ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి రావొచ్చని ఓ నివేదిక పేర్కొంది. ఈ నెలాఖరులో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నేపథ్యంలో భారత్‌కు ఈ సిరీస్ చాలా కీలకం.
ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమిండియా ఐదు మ్యాచుల్లో కనీసం నాలుగింట్లో గెలవాల్సి ఉంటుంది. అలాగే, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం రెండోస్థానానికి పడిపోయింది. రాబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్ ప్రారంభానికి ముందు సీనియర్ ఆటగాళ్లను దశలవారీగా పక్కన పెట్టాలని బీసీసీఐ యోచిస్తుందని జాతీయ మీడియా నివేదిక పేర్కొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లో కనీసం ఇద్దరికి ఆస్ట్రేలియాతో సిరీస్ ఆఖరి పర్యటన కావొచ్చని నివేదిక పేర్కొన్నది. నలుగురు ఆటగాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్నారు.
భారత్ టెస్ట్ క్రికెట్ భవిష్యత్‌పై కెప్టెన్ రోహిత్ ప్రశ్నించారు. తమ దృష్టి ఆస్ట్రేలియా సిరీస్‌పైనే ఉందన్నారు. అయితే, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కార్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్‌తో సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్‌పై అనధికారికంగా చర్చలు జరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా నవంబర్ 10న బయలుదేరనున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించినందుకు ప్రస్తుతానికి ఎలాంటి గందరగోళం లేదని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి జాతీయ మీడియాకు తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అనర్హత సాధించకపోతే ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో నలుగురులో పలువురి ఆటగాళ్ల పేర్లు కనిపించకపోవచ్చని ఆయన చెప్పారు.
స్వదేశంలోనూ కివిస్‌తో జరిగిన సిరీస్ ఆఖరిది కావచ్చన్నారు. బీసీసీఐ 2011 కథ పునరావృతం కావొద్దని బీసీసీఐ కోరుకుంటుందని చెప్పారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కొత్త సైకిల్ ఇంగ్లండ్ సిరీస్‌తో మొదలవుతుంది. వచ్చే ఏడాది జూన్ 20 కొత్త సైకిల్ మొదలవుతుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు ఎదురుచూస్తున్న సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది.
రోహిత్ 2021 ఫిబ్రవరి నుంచి 35 టెస్టులు ఆడగా 37.18 సగటుతో 1210 పరుగులు చేశాడు. గతేడాది పది ఇన్నింగ్స్‌లో కేవలం రెండు అర్ధ సెంచరీలను మాత్రమే చేయగలిగాడు. ఆరు ఇన్నింగ్స్‌లో పది కంటే తక్కువ పరుగులు చేశాడు. అలాగే, కోహ్లీ సైతం నిరాశ పరిచాడు. గత 25 ఇన్నింగ్స్‌లో 30.91 సగటుతో 742 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ నాలుగు సెంచరీలు చేయగా.. కోహ్లీ ఒక్క సెంచరీ మాత్రమే సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భవిష్యత్ టెస్ట్ క్రికెట్ పగ్గాలను శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లో ఒకరికి అప్పగించవచ్చే అవకాశాలున్నాయి.