వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ కూల్చాడు. భారత బౌలర్లకు తలనొప్పిగా మారుతున్న టామ్ బ్లండెల్ (38 బంతుల్లో 2)ను అవుట్ చేశాడు. అశ్విన్ వేసిన బంతిని టామ్ చక్కగానే డిఫెండ్ చేసుకున్నాడు. అయితే బ్యాట్‌కు తగిలిన ఆ బంతి పిచ్‌పై స్టెప్ పడి వికెట్ల పైనుంచి వెళ్లి వికెట్ కీపర్ భరత్ చేతుల్లో పడింది.
అయితే వికెట్ల పైనుంచి వచ్చే క్రమంలో బెయిల్స్‌ను ముద్దాడింది. దీంతో బెయిల్స్ కిందపడ్డాయి. అంతే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా, బ్లండెల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ జట్టు 138 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయానికి ఆ జట్టు 146 పరుగుల దూరంలో ఉంది. అయితే భారత్ మాత్రం మరో మూడు వికెట్లు తీసుకుంటే మ్యాచ్ గెలుస్తుంది.