Rohit Sharma: వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సారథి రోహిత్ శర్మ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే హిట్టింగ్‌కు దిగుతున్న హిట్‌మ్యాన్.. ప్రత్యర్థి బౌలర్లపై ఆది నుంచే ఆధిపత్యం చెలాయిస్తూ భారత్ భారీ స్కోర్లు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. అలవోకగా సిక్సర్లు బాదే రోహిత్ నేటి మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టి ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన సౌతాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్ రికార్డుతో పాటు మరికొన్ని రికార్డులనూ బ్రేక్‌చేశాడు.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్.. అకర్మన్ వేసిన ఏడో ఓవర్లో తొలి సిక్సర్ కొట్టాడు. 2023లో రోహిత్‌కు ఇది 59వ సిక్సర్. అంతకుముందు ఈ రికార్డు డివిలియర్స్ పేరిట ఉండేది. 2015లో మిస్టర్ 360.. వన్డేలలో 58 సిక్సర్లు బాదాడు. క్రిస్ గేల్ 2019లో ఈ రికార్డుకు దగ్గరగా (56 సిక్సర్లు) వచ్చినా దానిని బ్రేక్ చేయలేకపోయాడు. అంతేగాక ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ మెగాటోర్నీలో రోహిత్ 23 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన సారథులలో ఇయాన్ మోర్గాన్ (2019లో 22), ఏబీ డివిలియర్స్ (2015లో 21), ఆరోన్ ఫించ్ (2019లో 18) లు తర్వాత జాబితాలో ఉన్నారు.
Most Sixes in a calendar year in ODIs:
Rohit Sharma – 59*
AB De Villiers – 58. pic.twitter.com/XCWzAjMPf1— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2023
సచిన్ రికార్డు సమం..
ఈ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు భారీ సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన రోహిత్.. రెండు వరల్డ్ కప్ ఎడిషన్లలో 500 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును సమం చేశాడు. సచిన్ 1996, 2003లో ఈ రికార్డు సాధిస్తే రోహిత్ వరుసగా 2019, 2023లలో ఈ ఘనతను అందుకున్నాడు. అంతేగాక సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత సారథిగా కూడా రోహిత్ నిలిచాడు. 2003 వరల్డ్ కప్‌లో సౌరవ్ గంగూలీ 465 రన్స్ చేయగా రోహిత్ ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లలో 503 రన్స్ సాధించాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో 500 పరుగులు చేసిన తొలి సారథి రోహిత్..