Ind vs Eng Test | ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగులకు ఆలౌవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్ 42 పరుగులు చేశాడు. నలుగురు మినహా మరే బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, జోష్ టంక్ చెరో నాలుగు వికెట్లతో రాణించారు. బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లండ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. గిల్, యశస్వి, పంత్ సెంచరీలు చేసి స్కోర్‌ను 450 దాటించారు. భారత జట్టు తరఫున రాహుల్, యశస్వి జోడీ శుభారంభం అందించింది. తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఈ మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్, ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టెస్టులు ఆడిన కరుణ్ నాయర్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా సైతం ఖాతా తెరువకుండానే పెవిలియన్‌కు చేరారు. జడేజా (11), ప్రసిద్ధ్ కృష్ణ (1) పరుగులు చేయగలిగాడు. తొలిరోజు భారత్ మూడు వికెట్లకు 359 పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్ 127, రిషబ్ పంత్ 65 పరుగులతో అజేయంగా నిలిచారు. తొలిరోజు హాఫ్ సెంచరీ చేసిన వైస్ కెప్టెన్ పంత్ రెండోరోజు సైతం దూకుడుగా ఆడాడు. సిక్సర్ కొట్టిన తన కెరియర్లో ఏడో సెంచరీ చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోని వెనక్కి నెట్టాడు. ఆ తర్వాత గిల్ అవుట్ అయ్యాడు.
227 బంతుల్లో 147 పరుగులు చేసిన గిల్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి చోటు సంపాదించిన నాయర్ తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత 178 బంతుల్లో 134 పరుగులు చేసిన పంత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శర్దూల్ అవుట్ (1) అవుట్ అయ్యాక.. లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా (0), రవీంద్ర జడేజా (11), ప్రసిద్ధ్ (1) పరుగు చేసి అవుట్ అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్‌కు తలో వికెట్ దక్కింది. రెండోరోజు టీమిండియా 112 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. వాతావరణం అనుకూలించడంతో ఫాస్ట్ బౌలర్లు చెలరేగిపోయారు. ఆకాశం మేఘావృతం కావడంతో బౌలర్లకు కలిసి వచ్చింది. ప్రస్తుతం వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ నిలిచిపోయింది.