Rishabh Pant | టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించారు. లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బ్యాక్‌టుబ్యాక్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 134, సెకండ్ ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ టీమిండియా ఐదువికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో మాజీ కోచ్ స్పందిస్తూ పంత్ ఎంసీసీ ప్లేయింగ్ మాన్యువల్‌లో లేని షాట్లు ఆడుతున్నాడని.. అతన్ని తొలిసారి చూసినప్పుడు తనకు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు గుర్తుకు తెచ్చాడని పేర్కొన్నారు. రిషబ్ చాలా వేగంగా పరుగులు చేస్తాడని.. అతని ప్రదర్శన అద్భుతమని పేర్కొన్నారు. పాత రోజుల్లో సాధ్యం కాదని షాట్లు ఆడడం చూడవచ్చని.. అతన్ని చూడడం ఉత్సాహంగా ఉంటుందని చాపెల్ పేర్కొన్నారు.
క్రికెట్ మైదానంలో పంత్ ఏం చేయగలడో ఎవరికీ తెలియదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ తెలిపారు. మొదటి బంతి నుంచి అతని నుంచి ఏమి ఆశించాలో ఎప్పటికీ తెలియదని.. ఏ దశలోనైనా కదులుతూ ర్యాంప్ షాట్స్ ఆడగలడని చెప్పారు. తన బ్యాట్‌తో క్రికెట్‌కు కొత్త రూపాన్ని ఇస్తున్నాడని ప్రశంసించాడు. టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను సైతం ప్రశంసించాడు. గిల్‌కు ఇది గొప్ప టెస్ట్ మ్యాచ్ అని.. మంచి ఆరంభం లభించిందని.. విచారకరంగా ఫలిత్ భారత్‌కు అనుకూలంగా లేదని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో చాలా మంచి విషయాలు ఉన్నాయని.. గిల్ కెప్టెన్‌గా, ఆటగాడిగా గొప్ప ఆరంభం అందుకున్నాడని.. అయితే ఫలితం మాత్రం లభించలేదన్నాడు. క్యాచ్‌లు జారవిడవకుండా ఉండి.. లోయర్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన ఇచ్చి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదని చాపెల్ చెప్పుకొచ్చారు.