IND vs ENG ODI | నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్‌లో రాణిస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ 75 పరుగులు జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. హార్దిక్ పాండ్యా ఓవర్లో ఫిల్ సాల్ట్‌ను శ్రేయాస్ అయ్యర్ రన్ అవుట్ చేయగా.. పదో ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి బెన్ డకెట్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్ సైతం అవుట్ అయ్యాడు. ఒక దశలో 75 పరుగులకు వికెట్ నష్టపోకుండా స్కోర్ చేసిన ఇంగ్లాండ్.. వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జో రూట్, జోస్ బట్లర్ క్రీజులో ఉన్నారు. నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణాకు రెండు వికెట్లు దక్కాయి.
నాగ్‌పూర్ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు నిలకడగా ఆరంభించింది. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ తొలి వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. ఆరు ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 52 పరుగులకు చేరుకుంది. ఆరో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన హర్షిత్ రాణా ఓవర్లో సాల్ట్ 26 పరుగులు చేశాడు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. హర్షిత్ వేసిన ఈ ఓవర్లో సాల్ట్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. ఇంగ్లాండ్ జట్టు 75 పరుగుల వద్ద తొలి ఎదురుదెబ్బ తగిలింది. అర్ధ సెంచరీ దిశగా పయనిస్తున్న ఓపెనర్ ఫిల్ సాల్ట్ రనౌట్ అవుట్ అయ్యాడు. దాంతో హాఫ్ సెంచరీని మిస్సవడంతో పాటు బెన్ డకెట్‌తో అర్ధ సెంచరీ భాగస్వామ్యానికి తెరపడినట్లయ్యింది.