Siraj | ఇంగ్లండ్ క్రికెట్ మాజీ ఆల్‌రౌండ్ మొయిన్ అలీ టీమిండియా ఫాస్ బౌలర్ సిరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. సిరాజ్ ధైర్యం, ప్రతికూల పరిస్థితులకు తలవంచకుండా పోరాడే మనోబలం ఇతర బౌలర్లతో వేరు చేస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచు టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ 23 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను 2-2తో డ్రా చేయడంలో కీలకపాత్ర పోషించాడు. జీఎఫ్ఎస్ డెవలప్మెంట్ విడుదల చేసిన ప్రకటనలో మోయిన్ అలీ.. ‘సిరాజ్ ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శను చేశాడు. అతని శక్తి, ఆగ్రహం, స్థిరత్వం అద్భుతంగా ఉన్నాయి. భారత జట్టు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.
బ్యాట్స్‌మెన్స్‌కు అతన్ని ఎదుర్కోవడం ఎల్లప్పుడూ సవాల్ ఉంటుంది. అతని బంతిని నియంత్రించగలిగే శక్తి చాలా ఆసక్తికరమైన విషయం. అతనో ధైర్యవంతుడూ. ఎప్పుడూ దాన్ని వదిలిపెట్టడు. ఇదే అతన్ని ప్రత్యేకంగా చేస్తుంది. క్రెడిట్ మొత్తం అతనికే దక్కుతుంది’ అని చెప్పుకొచ్చాడు. భారత జట్టు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ లేకుండానే ఈ సారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని యువ జట్టు అద్భుతంగా రాణించింది. ఈ టూర్ సిరాజ్ ప్రత్యేకంగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టులు ఆడిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ ఏకంగా 185.3 ఓవర్లు ఓవర్లు వేశాడు. మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో తొమ్మిది వికెట్లు చివరిదైన ఓవల్ టెస్టులో తీసినవే. ఓవల్ టెస్ట్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను గెలిపించడంతో భారత్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది.