Anil Kumble | క్రికెట్ రూల్స్‌లో మార్పులు తీసుకురావాలని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే డిమాండ్ చేశారు. సలైవా వాడకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని, డ్యూక్ బంతి నాణ్యతను మెరుగుపరచాలని ఐసీసీకి సిఫారసు చేరశారు. ప్రస్తుతం ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుండగా.. డ్యూక్ బంతిపై వివాదం తలెత్తింది. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో కుంబ్లే మాట్లాడుతూ.. ‘బంతి మృదువుగా మారడం లేదంటే మార్చాల్సిర్నొ చెప్పాడు. ఎందుకంటే చాలా తరుచుగా లయను కోల్పోతుంది. ఇందు కోసం ఏదైనా చేయాలి. బంతి పది ఓవర్లు నిలబడకపోతే బంతిని తరుచుగా మార్చడం సరికాదు. క్రికెట్‌కు మాత్రమే కాదు బంతికి కూడా’ అని పేర్కొన్నారు. పది ఓవర్ల మ్యాచ్ తర్వాత బంతిని మార్చడంపై టీమిండియా ప్లేయర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లార్డ్స్‌లో జరుగుతు మూడో టెస్ట్ మ్యాచ్ రెండోరోజు ఉదయం సెషన్లో రెండుసార్లు బంతిని మార్చారు. కేవలం పది ఓవర్ల ఆట తర్వాత బంతిని మార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మాట్లాడుతూ గతంలోని తయారీ ప్రమాణాల మేరకు బంతిని తీసుకురావడం ఓ పరిష్కారం కావొచ్చని పేర్కొన్నారు. డ్యూక్ బంతి పాత వెర్షన్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌కు మద్దతు తెలిపారు. ఐదేళ్ల కిందట అందుబాటులో ఉన్నదాన్ని తిరిగి తీసుకురావడం న్యాయమని తాను భావిస్తున్నానని మాజీ హెడ్‌కోచ్ తెలిపాడు. లాలాజల వాడకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కుంబ్లే డిమాండ్ చేశారు. బంతిని మెరుస్తూ లాలాజలం వాడకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కుంబ్లే ఐసీసీని కోరారు. ఇది బౌలర్లకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బంతిని మెరిసేలా చేయడం, రివర్స్ స్వింగ్ రాబట్టవచ్చని మాజీ కెప్టెన్ తెలిపాడు.