IND vs ENG | భారత్–ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా వైజాగ్, రాజ్‌కోట్‌లలో గెలిచిన టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఈనెల 23 నుంచి ఇరు జట్ల మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే నాలుగో టెస్టులో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశముంది. పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రాకు రాంచీ టెస్టులో విశ్రాంతినిచ్చే అవకాశాలుండగా తొడ కండరాల గాయంతో రెండు, మూడు టెస్టులకు విఫలమైన కెఎల్ రాహుల్ పూర్తి పిట్నెస్ సాధించి నాలుగో టెస్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరి రాహుల్ వస్తే వేటు పడేది ఎవరిపై..? అన్నది ఆసక్తికరంగా మారింది.
రాహుల్ ఎంట్రీ..
హైదరాబాద్ టెస్టులో సెంచరీకి సమీపంగా వచ్చిన రాహుల్.. ఆ మ్యాచ్‌లో గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. రాజ్‌కోట్‌లో అతడు ఆడతాడని భావించినా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని టీమ్ మేనేజ్మెంట్ అతడిని పక్కనబెట్టింది. కానీ గతవారమే అతడు 90 శాతం ఫిట్నెస్ సాధించాడని ప్రస్తుతం మ్యాచ్ ఆడే ఫిట్నెస్ సొంతం చేసుకున్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు హైదరాబాద్‌లో భారత్‌పై గెలిచిన ఇంగ్లండ్‌కు నిర్జీవమైన వైజాగ్ పిచ్‌పై చుక్కలు చూపి సిరీస్‌లో టీమిండియాను పోటీలోకి తెచ్చాడు బుమ్రా.. ఈ సిరీస్‌లో అతడు ఇప్పటికే 17 వికెట్లు పడగొట్టి హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. మూడో టెస్టులోనే బుమ్రాకు రెస్ట్ ఇస్తారని వార్తలు వచ్చినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడిని ఆడించింది. అయితే వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు రాంచీ టెస్టులో విశ్రాంతినిచ్చి పేసర్లకు అనుకూలంగా ఉండే ధర్మశాలలో ఆడించనున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ రోహిత్ సేన రాంచీలోనే ఇంగ్లండ్ పనిపడితే ధర్మశాలలో కూడా బుమ్రాను ఆడించకపోవచ్చు.
KL Rahul will play 4th Test Match against England. (Sports Tak)
– Great news for Indian cricket & fans..!!! pic.twitter.com/SA6h8QjOIe
— CricketMAN2 (@ImTanujSingh) February 19, 2024
వేటు అతడిమీదేనా..!
రాహుల్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో మిడిలార్డర్లో రజత్ పాటిదార్‌పై వేటు తప్పకపోవచ్చు. వైజాగ్ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించాడు. 72 బంతులాడి 32 పరుగులు చేసిన పాటిదార్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 9 పరుగులే చేశాడు. ఇక పరుగుల వరద పారిన రాజ్‌కోట్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5, సెకండ్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. మరోవైపు రాజ్‌కోట్‌లోనే ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్థసెంచరీలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వైజాగ్‌లో సెంచరీ చేసిన గిల్.. మూడో టెస్టులో తృటిలో సెంచరీ (91) దూరమయ్యాడు. ఎటొచ్చి పాటిదార్ పైనే కత్తి వేలాడుతోంది.