ENG Vs IND Test | ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతున్నది. ఎడ్జ్బాస్ట్ టెస్టులో తొలిరోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 42 పరుగులు, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 14 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టాస్ ఓడిపోయి బ్యాంటింగ్‌కు వచ్చిన టీమిండియాకు ప్రారంభంలోనే వోక్స్ షాక్ ఇచ్చాడు. టీమిండియా 15 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో వోక్స్ వేసిన బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నంలో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కరుణ్ నాయర్- జైస్వాల్ కలిసి 90 బంతుల్లోనే 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే జైస్వాల్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. టీమిండియా స్కోర్ 95 పరుగులకు చేరిన సమయంలో బ్రైడన్ కార్సీ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. నాయర్ 50 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జైస్వాల్ ఇద్దరు కలిసి స్కోర్‌ను 150 దాటించారు. కొద్దిసేపటికే బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జైస్వాల్ అవుట్ అయ్యాడు. తృటిలో జైస్వాల్ సెంచరీని చేజార్చుకున్నాడు. 107 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో 87 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. జైస్వాల్-గిల్ జోడీ మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం గిల్, పంత్ క్రీజులో ఉన్నారు.