IND Vs BAN U-19 | అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా టైటిల్ పోరాటం మరోసారి తడబడింది. ఫైనల్లో టీమిండియాను ఓడించి వరుసగా రెండోసారి బంగ్లాదేశ్ రెండోసారి టైటిల్‌ను నెగ్గింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ రిజాన్ హుస్సేన్ 47 పరుగుల ఇన్నింగ్స్‌తో 49.1 ఓవర్లలో 10 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు కేవలం 139 పరుగులు చేసి 35.2 ఓవర్లలో ఆలౌట్ అయింది. అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను బంగ్లాదేశ్ వరుసగా రెండోసారి గెలుచుకుంది. అంతకుముందు, గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని 195 పరుగుల తేడాతో ఓడించింది. అండర్-19 ఆసియా కప్ 11వ సీజన్ కాగా.. ఈ టోర్నీలో భారత జట్టు ఎనిమిది సార్లు టైటిల్‌ను నెగ్గింది. 2023లో జరిగిన అండర్-19 ఆసియా కప్ సెమీ-ఫైనల్స్‌లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 49.1 ఓవర్లలో 198 పరుగులు చేసింది. ఇక 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 139 పరుగులకు పరిమితమైంది. మ్యాచ్ ఆసాంతం యువ టీమిండియా ఎక్కడా మ్యాచ్‌పై పట్టుబిగించిన పరిస్థితి కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడుతూ వచ్చాయి. టీమిండియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మహ్మద్ అమాన్ చేసిన 26 పరుగులే అత్యధికం. చివరలో హార్దిక్ రాజ్ 24 పరుగులు చేయడంతో టీమిండియా ఆ స్కోరైన చేయగలిగింది. కేపీ కార్తికేయ 21, ఆండ్రీ సిద్ధార్థ్ 20 పరుగులు చేశారు. ఇక ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆయుష్ ఒక పరుగు మాత్రమే తీశాడు. భారత జట్టులోని స్పెషలిస్ట్ బ్యాటర్ ఎవరూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. టీమిండియా మొదటి ఐదు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.
ఆరంభంలో సూర్యవంశీ, ఆయుష్ అవుట్ కావడంతో భారత జట్టు అవకాశాలను దెబ్బతీసింది. మిడిలార్డర్లో నిఖిల్ కుమార్ డకౌట్ కాగా.. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హర్వన్ష్ సింగ్ 6 పరుగులకు పెవిలియన్ చేశాడు. ఇక బంగ్లా బౌలర్లలో ఇక్బాల్ హుస్సేన్ ఇమాన్ 3, కెప్టెన్ అజీజుల్ హకీమ్ తమీమ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అల్ ఫహాద్‌కి రెండు, మారూఫ్ మృదా, రిజాన్ హసన్ తలొ వికెట్ తీశారు. బంగ్లాదేశ్ తరఫున రిజాన్ హుస్సేన్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహ్మద్ షిహాబ్ 40 పరుగులు సాధించాడు. ఫరీద్ హసన్ 39 పరుగులు చేయగా.. జవాద్ అబ్రార్ 20 పరుగుల చేశాడు. కలాం సిద్ధిఖీ (1) కెప్టెన్ మహ్మద్ అజీజుల్ హకీమ్ (16) దేబాశిష్ సర్కార్ (1), మహ్మద్ సమియున్ (4), అల్ ఫహద్ (1)ఇక్బాల్ ఎమోన్ (1) స్కోర్ చేయగలిగారు. టీమిండియా బౌలర్ యుధాజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. కిరణ్ చోరమోలే, కేపీ కార్తికేయ, ఆయుష్కు ఒక్కో వికెట్ దక్కింది.