IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి రెండో టెస్ట్ జరుగనున్నది. టెస్ట్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక వివరాలను వెల్లడించారు. మిడిలార్డర్లో తాను బ్యాటింగ్‌కు వస్తానని చెప్పాడు. పింక్ బాల్ టెస్ట్‌లో యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని ప్రకటించాడు. పెర్త్ టెస్ట్‌లో రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైస్వాల్-రాహుల్ జోడీ చెలరేగిన విషయం తెలిసిందే. రోహిత్ ఎంట్రీ తర్వాత మళ్లీ ఓపెనింగ్ ఎవరు చేస్తారనే చర్చ సాగింది. అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ జరుగనున్నది. ఇప్పటికు ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉన్నది. మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ని ప్రారంభిస్తాడని.. తాను మిడిలార్డర్లో వస్తానని చెప్పాడు.
ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్-యశస్వీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. డే-నైట్ టెస్టులో ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడో చూడాల్సిందే. పెర్త్ టెస్ట్‌లో రాహుల్, జైస్వాల్ భారత్‌కు శుభారంభం అందించారు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్‌లో 200పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ 77 పరుగులు చేశాడు. ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌లో యశస్వి, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మిడిలార్డర్లో రోహిత్ బ్యాటింగ్‌కు రావాలని రవిశాస్త్రితో సహా పలువురు మాజీ ఆటగాళ్లు సూచించిన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్‌లో విజయం కోరుకుంటున్నామని.. ఇద్దరు బ్యాటర్లు టాప్ ఆర్డర్లో తొలి టెస్ట్‌లో అద్భుతంగా రాణించాడని హిట్ మ్యాన్ ప్రశంసించాడు. మళ్లీ ఇప్పుడు జోడీని మార్చాల్సిన అవసరం లేదని అనిపించిందని.. భవిష్యత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చని.. ఏం జరుగుతుందో తెలియదని చెప్పాడు.