మొహాలీ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతన్న సూర్యకుమార్ యాదవ్ (46) హాఫ్ సెంచరీకి అడుగుదూరంలో పెవిలియన్ చేరాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి హార్దిక్ పాండ్యా సిక్సర్ బాదాడు. అదే ఓవర్ మూడో బంతి ఎక్స్ట్రా బౌన్స్ అయింది. అది సరిగా అంచనా వేయలేకపోయిన సూర్య.. బంతిని డీప్ థర్డ్ దిశగా పంపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ మాథ్యూ వేడ్ పట్టేసుకున్నాడు. భారత జట్టు 14 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులతో నిలిచింది.
Surya Kumar departs after scoring 46 off 25 balls!
He is certainly the best Indian T20I player currently!
Green with the wicket!#INDvsAUS #INDvAUS pic.twitter.com/Yp0hHgTm5z
— Sportz Point (@sportz_point) September 20, 2022