IND vs AUS | భారత్, న్యూజిలాండ్‌తో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. రాబోయే యాషెస్ సిరీస్‌కు సిద్ధయ్యేందుకు పూర్తి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, న్యూజిలాండ్‌తో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు కమ్మిన్స్‌ను జట్టులోకి తీసుకోవడం లేదని.. ప్రస్తుతం రిహాబిలిటేషన్ ప్రణాళికపై దృష్టి సారిస్తాడని పేర్కొంది. కీలక సిరీస్‌లకు కమ్మిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ కావొచ్చు. ఇటీవల స్కాన్‌లో నడుము దిగువ భాగంలో బోన్స్‌లో ఒత్తిడి ఉన్నట్లుగా గుర్తించారు.
వన్డేలు, టీ20లో శారీరక శ్రమ ఇప్పటికే విపరీతంగా పెరగడంతో గాయం మరింత ఆందోళన కలిగిస్తున్నది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్‌కు ఇప్పటికే విశ్రాంతి ఇచ్చింది. గత టెస్ట్ సిరీస్ సమయంలో వెన్నునొప్పి ఉండగా.. తీవ్రత పెరిగింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నవంబర్‌లో యాషెస్ సిరీస్ జరుగనున్నది. నవంబర్ 21న పెర్త్‌లో మొదలుకానున్నది. కమిన్స్ సన్నద్ధతపై బోర్డు ఆశాజనకంగా ఉంది. తొలి టెస్ట్ వరకు కోలుకుంటాడని భావిస్తుంది. అయితే, అప్పటి వరకు సన్నద్ధమవుతాడా? లేదా? అన్నది స్పష్టంగా లేదని సెలక్షన్ కమిటీ చీఫ్ జార్జ్ బెయిలీ తెలిపారు. కమిన్స్ లేకపోవడంతో మిచెల్ మార్ష్ భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని బెన్ ద్వార్షూయిస్, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ మోయనున్నారు. భారత్, న్యూజిలాండ్ వంటి బలమైన ప్రత్యర్థులపై ఆస్ట్రేలియా జోరు కొనసాగించే బాధ్యత వీరిపైనే ఉన్నది.
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మంగళవారం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, భారత్‌తో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఆడే అవకాశాలున్నది. కమ్మిన్స్ లేకపోవడం టీమిండియాకు ఊరట కలుగనున్నది. ఎందుకంటే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కనిపించనున్నారు. కీలమైన ఫాస్ట్ బౌలర్, రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడంతో భారత జట్టులో మనోధైర్యం పెంచుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యాషెస్‌కు ముందు ఆస్ట్రేలియా కమ్మిన్స్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మాజీలు సూచిస్తున్నారు. అందుకే భారత్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు దూరంగా ఉంచినట్లుగా భావిస్తున్నారు.