ICC | టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) షాక్ ఇచ్చింది. కీలక చర్యలు తీసుకున్నది. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో మైదానంలోనే ఆసిస్ బ్యాటర్‌తో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ సిరాజ్‌కు జరిమానా విధించగా.. హెడ్‌ను మందలించింది. సిరాజ్‌కు మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సిరాజ్, ట్రావిస్ హెడ్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. అడిలైడ్ టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక సిరాజ్ దూకుడుగా వ్యవహరించాడని.. ఇద్దరి మధ్య కొద్ది సెకన్ల పాటు వాగ్వాదం జరిగింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.5ని ఉల్లంఘించినందుకు సిరాజ్‌కు మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. సెక్షన్ 2.13 ఉల్లంఘినందుకు ట్రావిస్ హెడ్‌ను మందలించింది. అయితే, బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది.
310 పరుగుల స్కోరు వద్ద సిరాజ్ వేసిన యార్క్‌కు ట్రావిస్ హెడ్ బౌల్డ్ అయ్యాడు. 141 బంతుల్లో 140 పరుగులు చేసిన హెడ్‌ను బౌల్డ్ చేశాక సిరాజ్ దూకుడుగా వ్యవహరించారు. అయితే, హెడ్ సైతం పెవిలియన్‌కి వెళ్లే సమయంలో సిరాజ్‌ను ఏదో అన్నాడు. దానికి సిరాజ్ స్పందిస్తూ మొదట ఇక్కడి నుంచి వెళ్లు అన్నట్లుగా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. అయితే, తాను బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నానని.. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడని హెడ్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. అయితే, దాన్ని సిరాజ్ ఖండించారు. హెడ్ చెప్పివనన్నీ అబద్ధాలేనని కొట్టిపడేశాడు. ఈ గొడవపై ఇద్దరు కెప్టెన్లు సైతం స్పందించేందుకు ఇష్టపడలేదు. గొడవ గురించి హెడ్ చూసుకుంటాడని.. అతను పిల్లాడు కాదని ఆసిస్ కెప్టెన్ కమిన్స్ పేర్కొనగా.. దూకుడుగా ఉండడం తప్పులేదని.. సిరాజ్‌కు మద్దతు ఇస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.