Ind Vs Aus | భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్.. లైవ్‌లోకి మాస్ మహరాజా రవితేజ
Actor Raviteja | వన్డే ప్రపంచ కప్‌లో (ODI WC 2023) భాగంగా ఇవాళ భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి 15 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ నష్టపోయి 71 పరుగులు చేసింది.
Actor Raviteja | వన్డే ప్రపంచ కప్‌లో (ODI WC 2023) భాగంగా ఇవాళ భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి 15 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ నష్టపోయి 71 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 40 పరుగులతో, స్టీవెన్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ సందర్భంగా.. స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్‌లో మాస్ మహారాజ రవితేజ (Raviteja) సందడి చేశారు.
రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao). ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. రవితేజ తెలుగు క్రికెట్ లైవ్ కామెంటరీలో పాల్గోన్నాడు. అనంతరం క్రికెట్ అభిమానులతో రవితేజ ముచ్చటించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The #TigerNageswaraRao aka @RaviTeja_offl joins the commentary box for #INDvsAUS match in #WorldCup2023.
Catch him live now on @StarSportsTel 🤟#WorldCup2023 #WorldCupOnStar #Starniadugu #TigerNageswaraRaoOnOct20th 💥 pic.twitter.com/EwIs69dU10
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 8, 2023
Mass Maharaja @RaviTeja_offl is in full form with the mic 🎙️👌👌
Catch him live now on @StarSportsTel 🤟#INDvsAUS #WorldCup2023 #WorldCup2023 #WorldCupOnStar #Starniadugu #TigerNageswaraRao #TigerNageswaraRaoOnOct20th 💥 pic.twitter.com/cCb7dwV4lv
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 8, 2023
అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్, నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో రవితేజకు జోడిగా నుపుర్ సనన్ నటించింది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ, తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

