IND Vs AUS | టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్పై భారం పడుతుందన్న వార్తలను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తోసిపుచ్చారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో మిస్టరీ బౌలర్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో 11.25 సగటు, 2.50 ఎకానమీతో 12 వికెట్ల పడగొట్టాడు. అయితే, రెండో టెస్ట్‌లో బుమ్రా గాయం సమస్యలతో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలోపై అతనిపై భారం తగ్గించాలన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ.. ఆస్ట్రేలియాతో జరిగిన అన్ని మ్యాచుల్లో బుమ్రా ఆడాలని అభిప్రాయపడ్డారు మంజ్రేకర్. గత మూడేళ్లలో బుమ్రా భారత్ తరఫున 34శాతం మ్యాచులు మాత్రమే ఆడాడని గుర్తు చేశారు.
బుమ్రాను భారత క్రికెట్ చూసుకుంటుందని.. దాంతో అతను ప్రతి టెస్ట్‌లో ఆడాలన్నారు. మూడేళ్లలో 34 శాతం మ్యాచ్‌లు మాత్రమే ఆడాడని.. దాంతో అతనికి చాలా విశ్రాంతి లభించిందన్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ సిరీస్ ఎప్పటికీ గుర్తుండిపోయేదని.. ఈ సమయంలో జట్టుకు అతని అవసరం చాలా ఉందన్నారు. 2022 నుంచి భారత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 165 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో అందులో బుమ్రా 47 మ్యాచ్‌లు ఆడాడు. గత మూడేళ్లలో భారత్ తరఫున బుమ్రా కేవలం 28.48 శాతం మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను గాయం కారణంగా 10 నెలలు దూరంగా దూరమయ్యారు. 2022 నుంచి భారత్ 28 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో బుమ్రా 17 మ్యాచులకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు.