IND vs ENG 5th Test | ఇంగ్లండ్‌పై తొలిసారి ఆ ఘనత సాధించిన టీమిండియా
IND vs ENG 5th Test | ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రాణించడంతో ఈ టెస్టులో భారత్ 400 ప్లస్ స్కోరు చేసి 200 ప్లస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది.
IND vs ENG 5th Test | ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత టాపార్డర్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రాణించడంతో ఈ టెస్టులో భారత్ 400 ప్లస్ స్కోరు చేసి 200 ప్లస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఫస్ట్ ఫైవ్ బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు చేయడం భారత్‌కు 15 ఏండ్ల తర్వాత ఇదే ప్రథమం.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో యశస్వీ.. 57 పరుగులు చేయగా రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110)లు సెంచరీలు చేశారు. అరంగేట్ర టెస్టు ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్ 65 పరుగులు చేశాడు. ఐదో నెంబర్లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ 56 పరుగులతో ఈ సిరీస్‌లో మూడో అర్థ సెంచరీ సాధించాడు. భారత్ తరఫున ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో తొలి ఐదుగురు బ్యాటర్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయడం ఇంగ్లండ్ పై ఇదే ప్రథమం. ఓవరాల్‌గా టెస్టులలో ఈ ఘనత అందుకోవడం భారత్‌కు ఇది నాలుగోసారి. టీమిండియా తొలిసారి 1998లో ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధించింది.
It’s only the fourth time that India’s top five batters have all scored 50+ in the same Test innings, the first time against England 👏 #INDvENG pic.twitter.com/DWkV7i0nqc
— ESPNcricinfo (@ESPNcricinfo) March 8, 2024
ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌట్ అవగా.. భారత్ రెండో రోజు ఆటలో 104 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 434 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 216 పరుగులుగా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

