ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్థ శతకాలతో రాణించడానికి తోడు చివర్లో హార్థిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 210 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ 74, కేఎల్ రాహుల్ 69 పరుగులు చేశారు. పాండ్యా 13 బంతుల్లో 35 పరుగులు చేయగా.. రిశబ్ పంత్ 13 బంతుల్లో 27 పరుగులు చేశారు.
టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చిన ఓపెనర్లిద్దరినీ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు పెవిలియన్ చేర్చారు. కరీమ్ జనత్ బౌలింగ్‌లో రోహిత్ (74) అవుటైన కాసేపటికే 17వ ఓవర్లో కేఎల్ రాహుల్ (69)ను గుల్బాదిన్ బౌల్డ్ చేశాడు. రాహుల్ అవుటైన తర్వాత పాండ్యా క్రీజులోకి వచ్చాడు.
అదే ఓవర్ చివరి రెండు బంతులకు పంత్ రెండు సిక్సర్లు బాదాడు. పాండ్యా కూడా వచ్చీ రావడంతోనే బౌండరీ బాదాడు.
టీమిండియా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పాక్, న్యూజిల్యాండ్ చేతిల్లో పరాభవాల తర్వాత మిగతా మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలుపొందాల్సిన పరిస్థితిలో భారత్ ఉంది. ఇలాంటి క్రమంలో ఆఫ్ఘనిస్థాన్‌పై బరిలో దిగిన భారత్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. రోహిత్ శర్మ (53 నాటౌట్), కేఎల్ రాహుల్ (52 నాటౌట్) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ 107/0తో నిలిచింది. వీరిద్దరూ ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయం. ఆ తర్వాత బౌలర్లు కొంచెం గట్టిగా ప్రయత్నించినా టీమిండియా ఘనవిజయం సాధించి, సెమీస్ పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
అబుధాబి: ఇది కదా ప్రతి భారత అభిమానీ కోరుకుంది. పాక్, న్యూజిల్యాండ్ చేతిలో ఘోర పరాభవాల తర్వాత టీమిండియా జూలువిదిల్చింది. ఆఫ్ఘనిస్థాన్‌పై భారత ఓపెనర్లు చెలరేగుతున్నారు. రోహిత్ శర్మ (44 నాటౌట్), కేఎల్ రాహుల్ (40 నాటౌట్) పోటీపడి మరీ పరుగులు చేస్తున్నారు.
వీరి జోడీని ఎలా విడగొట్టాలో తెలియక ఆఫ్ఘన్ బౌలర్లు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. రోహిత్-రాహుల్ జోడీ అద్భుతంగా ఆడుతుందటంతో 10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. దీంతో భారీ స్కోరుకు పునాదులు పడినట్లే కనిపిస్తోంది.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే తమకంటూ పేరు సంపాదించుకుంటున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై టీమిండియా ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కేఎల్ రాహుల్ (18 నాటౌట్), రోహిత్ శర్మ (34 నాటౌట్) అద్భుతమైన ఆరంభాన్నందించారు.
ఆఫ్ఘన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 53 పరుగులు చేసింది.
అబుధాబి: టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మరోసారి టాస్ ఓడాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కోహ్లీ టాస్ గెలవని విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు కోహ్లీ చెప్పాడు.
అలాగే చిన్నగాయం కారణంగా వరుణ్ చక్రవర్తి తప్పుకున్నాడని, అతని స్థానంలో అశ్విన్ జట్టులో చేరాడని వెల్లడించాడు. అలాగే నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు మాజీ సారధి అష్రాఫ్ ఆఫ్ఘన్ రిటైరయిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో షరాఫుద్దీన్ ఆడనున్నాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా
ఆఫ్ఘనిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, మొహమ్మద్ షెహజాద్, రహ్మనుల్లా గుర్బాజ్, నజిబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, షరాఫుద్దీన్ అష్రాఫ్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, కరీమ్ జనత్, నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్.