అబుధాబి: భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. షమీ, బుమ్రా ఇద్దరూ ఆఫ్ఘన్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆఫ్ఘన్ ఓపెనర్లు షెహజాద్ (0), జజాయ్ (13) పరుగులు చేసి అవుటయ్యారు.
అయితే ఆ తర్వాత రహ్మనుల్లా గుర్బాజ్ (19) రెండు సిక్సర్లు, ఫోర్ బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న అతన్ని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. బౌండరీలైన్ వద్ద పాండ్యా అందుకున్న చక్కటి క్యాచ్‌కు అతను పెవిలియన్ చేరాడు. 10వ ఓవర్లో బంతి అందుకున్న రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో గుల్బాదిన్ నైబ్ ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో ఆఫ్ఘన్ జట్టు 59/4తో కష్టాల్లో పడింది.