అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (54 నాటౌట్), విరాట్ కోహ్లీ (51 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడుతున్నారు. వీళ్లిద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. రాహుల్ కూడా మరో ఎండ్‌లో చక్కని ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు 12 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 111 పరుగులతో నిలిచింది.
అయితే ఆ తర్వాతి ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన రాహుల్.. మరో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. ఫరీద్ అహ్మద్ వేసిన ఓవర్లో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన రాహుల్.. లాంగాన్‌లో నజిబుల్లా జద్రాన్‌కు చిక్కాడు. దీంతో భారత జట్టు 119 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించి, వికెట్ల మీదకు ఆడుకున్నాడు. దాంతో భారత జట్టు 13 ఓవర్లు ముగిసే సరికి 125/2 స్కోరుతో నిలిచింది.