కుమమోటొ : మంగళవారం ప్రారంభం కానున్న జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత నంబర్‌వన్ హెచ్.ఎస్. ప్రణయ్ బరిలోకి దిగనున్నాడు. వెన్ను నొప్పి కారణంగా డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలకు దూరంగా ఉన్న ప్రణయ్ ఈ టోర్నీలో సత్తా చాటాలని ఆశిస్తున్నాడు. గత నెలలో ఆసియాడ్‌లో కాంస్య పతక పోరు సందర్భంగా ప్రణయ్ గాయపడ్డాడు.
ప్రణయ్ తొలి రౌండ్లో హాంకాంగ్‌కు చెందిన లీ చోక్‌ను ఢీకొంటాడు. ఇతర భారత ఆటగాళ్లు లక్ష్య సేన్ జపాన్‌కు చెందిన కొడై నరోకతో, కిడాంబి శ్రీకాంత్ క్వాలిఫయర్‌తో తలపడనున్నారు. మహిళా విభాగంలో తలపడుతున్న ఏకైక భారత క్రీడాకారిణి పివి సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో, పురుషుల డబుల్స్ జోడి సాత్విక్-చిరాగ్ చైనీస్ తైపీకి చెందిన ఎలు చింగ్ యావొ-యాంగ్ పొ హాన్‌తో తలపడతారు.