సెంచూరియన్(దక్షిణాఫ్రికా): ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా హార్డ్‌హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ సెంచరీతో అదరగొట్టాడు. ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ తన ఇన్నింగ్స్‌లో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 భారీ సిక్స్‌లతో క్లాసెన్ 174 పరుగులు చేశాడు.
తాత్కాలిక కెప్టెన్ ఎడెన్ మార్క్మ్(్ర8) స్వల్ప స్కోరుకే నిష్క్రమించినా..ఎక్కడా వెనుకకు తగ్గకుండా క్లాసెన్ కొట్టిన కొట్టుడుకు దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 416/5 భారీ స్కోరు చేసింది. హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు.