గాలె: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో లంకేయులను 305 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. రెండో రోజు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 72 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55) అర్ధ సెంచరీలతో మెరిశారు. డారెల్ మిచెల్ (41 నాటౌట్), టామ్ బ్లండెల్ (18) క్రీజులో ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్ ఇంకా 50 పరుగులు వెనుకబడి ఉంది.