దుబాయ్: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో థ్రిల్. దాయాదిపై సమరం ఓ సూపర్ ఎన్కౌంటర్లా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేక్షకులు టీవీలకే హత్తుకుపోతారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఆ మజాయే వేరు. ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్ జట్లు అయిదుసార్లు తలపడ్డాయి. ఆ అయిదు మ్యాచుల్లో ఇండియాదే పైచేయి. మినీ ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో పొరుగు దేశం పాకిస్థాన్‌పై ఇండియా ఇప్పటి వరకు ఓడిపోలేదు. పవర్ఫుల్ షాట్లతో ప్రేక్షకుల్ని అలరించే ఈ ఫార్మాట్లో పాకిస్థాన్‌పై ఇండియానే తన ఆధిపత్యాన్ని చాటింది. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై అజేయంగా నిలిచిన ఇండియా గెలుపు ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిద్దాం.