హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తేతెలంగాణ): పోలీస్‌శాఖ, పారామిలటరీ బలగాల సిబ్బందికి సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 50 ప్లస్ కేటగిరీలో నిర్వహించిన ఆల్ఇండియా లాన్ టెన్నిస్ పోటీల్లో మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని టీమ్ స్వర్ణం సాధించింది. శనివారం బెంగళూరులో జరిగిన ఫైనల్లో చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణపేట ఏఆర్ అదనపు ఎస్పీ రియాజ్ జోడీ 9-6 స్కోర్ తేడాతో, ఏపీకి చెందిన డీఎస్పీలు రామ్‌కుమార్, సత్యనారాయణ ద్వయంపై విజయం సాధించింది.