Iga Swiatek : వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్(Iga Swiatek) మరో ఘనత సాధించింది. వరుసగా రెండో ఏడాది డబ్ల్యూటీఏ ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకుంది. దాంతో, అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్(Serena Williams) తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి క్రీడాకారిణిగా స్వియాటెక్ చరిత్ర సృష్టించింది. సెరెనా 2014, 15లో ఈ అవార్డు అందుకుంది. పోలండ్‌కు చెందిన స్వియాటెక్ నిరుడు ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్గు గెలిచి వార్తల్లో నిలిచింది.
ఈ ఏడాది ఆరంభం నుంచి జోరుమీదున్న స్వియాటెక్ నంబర్ 1 ర్యాంకుకు ఎగబాకింది. ఈ సీజన్లో స్వియాటెక్ రికార్డు స్థాయిలో ఆరు వరల్డ్ టూర్ టైటిళ్లు గెలిచింది. ఈ సీజన్లో 79 మ్యాచ్‌లు ఆడిన ఆమె 68 విజయాలు నమోదు చేసింది. సూపర్ ఫామ్‌తో రెండోసారి డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది.
2023 Player of the Year 👏
World No.1 @iga_swiatek has been voted as the WTA Player of the Year for the second year in a row! Winning a tour-leading six titles. pic.twitter.com/KNCaRXqkrM
— wta (@WTA) December 11, 2023
చైనాకు చెందిన ఝెంగ్ క్విన్వెన్ అత్యంత విలువైన ప్లేయర్ అవార్డు గెలుచుకోగా.. వర్థమాన క్రీడాకారిణి అవార్డు మిర్రా ఆండ్రీవా(రష్యా) ఎగరేసుకుపోయింది. ఇక స్టార్మ్ హంటర్(ఆస్ట్రేలియా), ఎలిసే మెర్టెన్స్(బెల్జియం) డబుల్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఒన్స్ జుబెర్(ట్యునీషియా)కు స్పోర్ట్స్మాన్షిప్ అవార్డు దక్కింది.
PV Sindhu | హోటల్ దొరక్క మాజీ వరల్డ్ నంబర్ 1 అపసోపాలు.. సాయమందించిన సింధు
Asia Cup 2024 | జనవరిలో ఆసియా కప్.. 50మందితో ఖతార్ వెళ్లనున్న భారత్
IPL 2024 | ఢిల్లీ సారథిగా పంత్.. ఆ ఒక్క షరతుకు బీసీసీఐ ఓకే చెప్పేనా?