Asia Cup 2024 | జనవరిలో ఆసియా కప్.. 50మందితో ఖతార్ వెళ్లనున్న భారత్
Asia Cup 2024 : వచ్చే ఏడాది జనవరిలో జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్(Asia Cup 2024) కోసం భారత ఫుట్‌బాల్ జట్టు(Indian Football Team) సన్నాహకాలు మొదలెట్టింది. ఖతార్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం హెడ్ కోచ్ ఇగొర్ స్టిమాక్(Igor Stimac) 50 మందితో కూడిన...
Asia Cup 2024 : వచ్చే ఏడాది జనవరిలో జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్(Asia Cup 2024) కోసం భారత ఫుట్‌బాల్ జట్టు(Indian Football Team) సన్నాహకాలు మొదలెట్టింది. ఖతార్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం హెడ్ కోచ్ ఇగొర్ స్టిమాక్(Igor Stimac) 50 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశాడు.
జనవరి 12 మొదలయ్యే ఆసియా కప్ టోర్నీ ప్రాబబుల్స్ బృందంలో ఐదుగురు గోల్ కీపర్లు, 15 మంది మిడ్‌ఫీల్డర్లు, 15 మంది డిఫెండర్లు, 15మంది ఫార్వర్డ్స్ ఉన్నారు. వీళ్లంతా టోర్నీకి కొన్ని రోజుల ముందే దోహా చేరుకోనున్నారు.
గోల్ కీపర్లు : గురుప్రీత్ సింగ్ సంధు, అమరిందర్ సింగ్, విశాల్ కైత్, ధీరజ్ సింగ్ మోయిరంగతెమ్, గుర్మీత్ సింగ్ చాహల్.
డిఫెండర్లు : నవొరెమ్ రోషన్ సింగ్, బికాశ్ యమ్నం, లాల్చునుంగ, సాదేశ్ ఝింగాన్, నిఖిల్ పూజారి, చింగ్లేసన సింగ్, ప్రీతమ్ కొటల్, హర్నిపమ్ రువాహ్, సుభాశిష్ బోస్, అశిశ్ రాయ్, ఆకాశ్ మిశ్రా, మెహ్తబ్ సింగ్, రాహుల్ భీకే, నరేందర్ గహ్లెట్, అమే రనవాడే.
🚨 #BlueTigers 🐯 Probables List 🚨#AFCAsianCup2023 🏆 #IndianFootball ⚽ pic.twitter.com/qKILng3wyE
— Indian Football Team (@IndianFootball) December 12, 2023
మిడ్‌ఫీల్డర్లు : సురేశ్ సింగ్ వంగ్జమ్, రోహిత్ కుమార్, బ్రాండన్ ఫెర్నాండేజ్, ఉడంత సింగ్ కుమాం, యాసిర్ మహ్మద్, జీక్సన్ సింగ్ థౌనోజమ్, అనిరుధ్ థాపా, సాహల్ అబ్దుల్ సమద్, గ్లాన్ మార్టిన్స్, లిస్టన్ కొలాకో, దీపక్ తంగ్రి, లలెంగ్మవియా రాల్టే, వినీత్ రాయ్, నిథోయింగబ మీటే, నవొరెమ్ మహేష్ సింగ్.
ఫార్వర్డ్స్ : సునీల్ ఛెత్రీ, రహీం అలీ, ఫరుఖ్ చౌదరీ, నందకుమార్ శేఖర్, శివ సాతి నారాయణన్, రాహుల్ కేపీ, ఇషాన్ పండిత, మన్వీర్ సింగ్, కియాన్ నసిరి, లల్లియంజులా ఛాంగటే, గుర్కీరత్ సింగ్, విక్రం ప్రతాప్ సింగ్, బిపిన్ సింగ్ థౌనావోజమ్, పర్తిబ్ గొగోయ్, జెర్రి మవిహిమింగ్థాంగే.
ఆసియా కప్‌లో భారత జట్టు గ్రూప్ బిలో ఉంది. జనవరి తొలివారంలో భారత జట్టు దోహా చేరుకొని శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. జనవరి 12న టోర్నీ షురూ కానుండగా.. లీగ్ దశలో టీమిండియా జనవరి 13న ఆస్ట్రేలియా, జనవరి 18న ఉజ్బెకిస్థాన్, జనవరి 23న సిరియాతో తలపడనుంది. ప్రతి గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్లు 16వ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
ఇవి కూడా చదవండి
- Telangana | 2024లో సెలవుల జాబితాను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- Cricket Australia | ఆ టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్చండి.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరిన ఆస్ట్రేలియా
- Shah Rukh Khan | డంకీ రిలీజ్‌కు ముందు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లిన షారుఖ్.. ఏడాదిలో మూడోసారి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

