PV Sindhu : భారత్ వేదికగా ఒడిశా మాస్టర్స్ 2023(Odisha Masters) టోర్నమెంట్‌కు రేపటితో తెరలేవనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో పలు విదేశీ క్రీడాకారిణులు పాల్గొననున్నారు. అయితే.. ఈ ఈవెంట్లో ఆడేందుకు ఒడిశా వచ్చిన మాజీ వరల్డ్ నంబర్ 1 నొజొమి ఒకుహర(Nozomi Okuhara)కు వింత అనుభవం ఎదురైంది. సిటీ అంతా తిరిగినా బస చేసేందుకు హోటల్ దొరక్క ఆమె అపసోపాలు పడింది. ఈ మధ్యే గువాహటి మాస్టర్స్(Guwahati Masters 2023) టైటిల్ నెగ్గిన ఈ జపాన్ షట్లర్ తగిన హోటల్ కోసం గంటల కొద్దీ నిరీక్షించింది.
ఏ హోట్‌లో అడిగినా రిజర్వేషన్ లేనందున గది ఇవ్వలేమని, ఆ రోజుకు అన్ని నిండిపోయానని చెప్పారు. దాంతో, చివరకు సోషల్‌మీడియా వేదికగా ఒకుహర తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ పోస్ట్ చూసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) ఒకుహరకు హోటల్ గది దొరకడంలో సాయం చేసింది. దాంతో, ఒకుహర ఇన్‌స్టాలో సింధు, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (BAI)కు ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఒకుహర తనకు హోటల్ సిబ్బంది వాటర్ బాటల్ ఇస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది.
Adventures in India Part 3 ft Nozomi Okuhara
I dont think after such experiences anyone would be willing to come back to India , harsh reality
I feel sorry on behalf of Indian Fans for all these the players have to go through 🙏 pic.twitter.com/luutwyE9dP— Just Badminton (@BadmintonJust) December 10, 2023
జనవరి 12వ తేదీన ఒడిశా మాస్టర్స్ షురూ కానుంది. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఒకుహర నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఇక భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat) టాప్ సీడ్‌గా పోటీ పడనున్నాడు. ఈ సీజన్లో పలు టోర్నీల్లో నిరాశపరిచిన సింధు ఒడిశా మాస్టర్స్‌లో ఆడడం లేదు.