HomeSportsIf Virat Kohli Gives 20 Minutes I Can Help Says Sunil Gavaskar
Virat Kohli | ఒక 20 నిమిషాలు టైం ఇస్తే.. కోహ్లీకి మంచి సలహాలు ఇస్తానన్న మాజీ దిగ్గజం
గత మూడేళ్లుగా సరైన ఫామ్ లేక తిప్పలు పడుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనను మరింత దారుణంగా ముగించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేసిన తను.. రెండు టీ20ల్లో 1, 11.. రెండు వన్డేల్లో 16, 17 పరుగులతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
కోహ్లీ తనతో ఒక 20 టైం ఇస్తే, అతను ఏం చెయ్యాలో చెప్తానని అన్నాడు. ‘‘నేను చేసే సూచనలు కోహ్లీకి హెల్ప్ చేస్తాయని అనుకుంటున్నా. అవి అతని ఆటతీరును వెంటనే మెరుగు పరుస్తాయని చెప్పడం లేదు. కానీ ఉపయోగపడే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఆ ఆఫ్‌స్టంప్ ఆవలి బంతుల విషయంలో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా’’ అని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు.
‘‘ఒక ఓపెనింగ్ బ్యాటర్‌గా, అలాగే అలాంటి బంతులకు ఇబ్బంది పడిన వాడిగా.. కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఒక 20 నిమిషాలు మాట్లాడితే కోహ్లీకి అవన్నీ చెప్తా’’ అని ఈ మాజీ సారధి అన్నాడు. కోహ్లీ చేసే తొలి తప్పే అతని విషయంలో చివరిది అవుతోందన్న సన్నీ.. భారీ ఇన్నింగ్స్‌లు లేకపోవడంతో ప్రతి బంతిని ఆడేందుకే బ్యాటర్ ప్రవర్తిస్తాడని, సాధారణంగా వదిలేసే బంతులను కూడా ఆడబోయి అవుటవుతామని వివరించాడు. అలాగే ఇంగ్లండ్ పర్యటనలో అతను కొన్ని అద్భుతమైన డెలివరీలకు అవుటయ్యాడని స్పష్టం చేశాడు.