SRH vs GT : ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మ్యాచ్ అనుకున్న టైమ్ కంటే మరింత ఆలస్యం కానుంది. సాయంత్రం 6:45కి వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో 8:00 గంటలకు టాస్ వేద్దామనుకున్నారు. తీరా ఆ సమయానికి మళ్లీ నేనొదలా అంటూ వరుణుడు స్టేడియాన్ని చుట్టుముట్టాడు. దాంతో, సిబ్బంది పరుగున వచ్చి పిచ్‌ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు.
షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:00 గంటలకు టాస్ వేయాలి. కానీ, వాన కారణంగా గంట ఆలస్యంగా 8:00 గంటలకు రిఫరీ, కెప్టెన్లు ప్యాట్ కమిన్స్, శుభ్‌మన్ గిల్లు టాస్కు సిద్ధమయ్యారు. కానీ, మళ్లీ చినుకులు మొదలయ్యాయి. 8:30 గంటలకు మ్యాచ్ షురూ కాకపోవడంతో ఓవర్ల కోత మొదలైంది.
Light show in Uppal stadium 🏟 #OrangeArmy #SRHvsGTpic.twitter.com/GfzVCNgCHR
— Sunrisers Army (@srhorangearmy) May 16, 2024
ఒకవేళ 10 గంటలకు చినకులు ఆగితే ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేసేందుకు కొంత సమయం పట్టనుంది. 10: 30కి గనుక మ్యాచ్ మొదలైతే కనీసం 5 ఓవర్ల ఆట సాధ్యమవుతుంది. అయితే.. 5 ఓవర్లు ఆడిస్తారా? లేదా? అనేదానిపై మ్యాచ్ రిఫరీగానీ, నిర్వాహకులుగానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Vibe to Naatu Naatu🔥
The lights are off and not the fans ✊ @SunRisers #SRHvsGT pic.twitter.com/1AQu7eWYLy
— Johnnie Walker (@Johnnie5ir) May 16, 2024
ప్లే ఆఫ్స్‌కు ముందు సొంతగడ్డపై వసన్రైజర్స్ ఆఖరి మ్యాచ్ ఇది. దాంతో, అభిమానులు మధ్యాహ్నం నుంచే భారీగా ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. అయితే.. ఎడతెరిపి లేని వాన వాళ్ల ఉత్సాహంపై నీళ్లు చల్లింది. అయినా సరే.. ఎంతో ఓపికగా మ్యాచ్ మొదలవ్వకపోతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దాంతో, నిర్వాహకులు మ్యాచ్ జరిగేంత వరకూ లైట్ షోతో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.
#SRHvsGT pic.twitter.com/KznmdpNokY
— kaushik (@BeingUk7) May 16, 2024