సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ఇంటెన్స్ లవ్‌స్టోరీ ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకుడు. పి.కిరణ్ నిర్మాత. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పకులు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ప్రీలుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.
శనివారం చిత్ర కథానాయకుడు జయకృష్ణ ఫస్ట్‌లుక్ పోస్టర్ని లాంచ్ చేశారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. దుమ్ము, ధూళీ ఎగసే రగ్గడ్ బ్యాక్‌డ్రాప్‌లో హై స్పీడ్‌లో బైక్ నడుపుతూ.. ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని, మరోచేత్తో గన్ టార్గెట్ చేస్తూ ఈ లుక్‌లో జయకృష్ణ కనిపించారు. రషా తడానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ ISC, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: చందమామ కథలు.