Sunil Gavaskar | టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టు సారథి బాబర్ ఆ దేశ ప్రధాని అవుతాడని భారత జట్టు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్.. ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా..? అని ఇటు క్రికెట్ అభిమానులతోపాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో.. గవాస్కర్ కాంమెట్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
‘ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ గెలిస్తే… జట్టు సారథి బాబర్ అజామ్ 2048లో పాక్ ప్రధాని అవుతారు’ అంటూ స్టార్ స్పోర్స్ట్‌తో గవాస్కర్ ఈ మాటలు అన్నారు. అయితే గవాస్కర్ మాటలకు అర్థం లేకపోలేదు.
1992లో జరిగిన ప్రపంచకప్‌లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ జట్టు కప్పు గెలిచింది. అనంతరం 26 ఏళ్లకు.. అంటే 2018లో ఇమ్రాన్ ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్ల అనంతరం ఆ పదవి నుంచి వైదొలిగారు. కాగా, 1992లో జరిగిన మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్.. ఇంగ్లాండ్ జట్టుతోనే తలబడి ఛాంపియన్‌గా నిలిచింది. అనుకోకుండా టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఈ రెండు జట్లే తలపడుతుంటడం విశేషం. ఈ మ్యాచ్‌లో బాబర్ సారథ్యంలోని జట్టు గెలిస్తే.. 26 ఏళ్ల తర్వాత అంటే 2048లో బాబర్ ఆ దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నది గవాస్కర్ మాటలకు అర్థం. 1992సీన్ తాజాగా రిపీట్ అవుతుండటంతో గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి.
— Guess Karo (@KuchNahiUkhada) November 10, 2022