Imran Khan: ఐపీఎల్లో పాక్ క్రికెటర్లను ఆడనివ్వకపోవడంపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం
Imran Khan :ఐపీఎల్ గురించి పాక్ ప్లేయర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. బీసీసీఐ బోర్డుకు నిధులు ఎక్కువగా వస్తున్నాయని, అందుకే ఆ బోర్డు అహంకారంతో వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఐపీఎల్ 2023 సీజన్ మొదలైన నేపథ్యంలో.. టైమ్స్ రేడియోతో ఇమ్రాన్ మాట్లాడారు.
ఇస్లామాబాద్: ఐపీఎల్లో పాక్ క్రికెటర్ల(Pakistan cricketers)ను ఆడనివ్వకపోవడం పట్ల పాక్ మాజీ క్రికెటర్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) స్పందించారు. ఐపీఎల్(IPL)లో పాక్ క్రికెటర్లకు ఛాన్సు ఇవ్వకపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టైమ్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి 2008 ఐపీఎల్ ఎడిషన్లో పాక్ క్రికెటర్లు ఆడారు. కానీ ముంబై దాడుల తర్వాత ఆ దేశ క్రికెటర్లను ఐపీఎల్కు ఎంపిక చేయడం లేదు.
బీసీసీఐ చాలా దురుసుగా, అహంకారంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఒకవేళ పాక్ క్రికెటర్లను ఆడనివ్వకుంటే, దాంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కువ మొత్తంలో నిధులను బీసీసీఐ(BCCI) రాబడుతోందని, అందుకే ఆ బోర్డు ఆహంకారంతో వ్యవహరిస్తున్నట్లు ఇమ్రాన్ ఆరోపించారు. ఇండియా, పాక్ మధ్య క్రికెట్ రిలేషన్షిప్ చెడిపోవడం దురదృష్టకరమన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

