కొలంబొ: శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అభయశేకర ఇక లేరు. ఆ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్లకు హాజరై క్రికెటర్లకంటె ఎక్కువ హల్చల్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. అంకుల్ పెర్సీ అని అభిమానంతో పిలుచుకునే అభయశేఖర సోమవారం మరణించారు.
87 ఏళ్ల పెర్సీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వైద్యంకోసం క్రికెట్ శ్రీలంక రూ.50 లక్షలు ఆర్ధిక సాయంకూడా చేసింది. పెర్సీ మరణం పట్ల ఆ దేశ దిగ్గజ ఆటగాళ్లు సనత్ జయసూర్య, రస్సెల్ ఆర్నాల్డ్ తదితరులు సంతాపం వ్యక్తంచేశారు. ఇటీవల ఆసియాకప్లో భాగంగా శ్రీలంక పర్యటన సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకూడా పెర్సీని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు.