దుబాయ్ : వచ్చే నెల 11 నుంచి ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం మ్యాచ్ నిర్వాహకులను ఐసీసీ ప్రకటించింది. ఈ మెగా బ్లాక్‌బస్టర్ పోరుకు టీమ్ఇండియా అర్హత సాధించలేకపోయినా భారత్ నుంచి ఇద్దరు వ్యక్తులు ఫైనల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ మ్యాచ్‌కు రిఫరీగా భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వ్యవహరించనుండగా నితిన్ మీనన్ ఫోర్త్ అంపైర్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), క్రిస్ జాఫనే (న్యూజిలాండ్) ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. శ్రీనాథ్, నితిన్‌తో పాటు భారత్ నుంచి ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి.. ఈ మ్యాచ్‌కు కామెంటరీ ప్యానెల్లో ఉన్న విషయం విదితమే.